లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు వేగంపెంచాలి
Ens Balu
8
Komaragiri
2022-05-17 10:28:09
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకంలో కొమరగిరి లేఅవుట్ లో నిర్మిస్తున్న ఇంటి సముదాయాలను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ మంగళవారం సందర్శించారు. నగరపాలక సంస్థ,గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన కమిషనర్ ఇళ్ల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ కాకినాడ ప్రాంతవాసులకు కొమరగిరి లేఅవుట్లో 16000 ఇళ్ళు మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలంలో ఇళ్ళు నిర్మించుకునేలా ఆయా శాఖల అధికారులు ప్రోత్సహించి అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. లేఅవుట్ ప్రాంతం లో అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం అనువైన సమయమని, వర్షాలు పడే లోపుగా ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను బ్యాంకులతో అనుసంధానం చేయడం, సొంతంగా నిర్మించుకోవాలనుకుంటే అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఆయన వెంట అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, గృహ నిర్మాణ శాఖ ఏడిఈ వెంకట్రావు, పలువురు అధికారులు సిబ్బంది ఉన్నారు.