నిరు పేదల పాలిట వరం నవరత్నాలు


Ens Balu
5
Balijipeta
2022-05-19 13:07:17

పేదల పాలిట  నవరత్నాలు వరం అని పార్వతీపురం  శాసన సభ్యులు అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ గ్రామంలో గురు వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను వివరించారు. లబ్దిదారులకు అందిన ప్రయోజనాలను తెలుసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ గ్రామానికి చెందిన ప్రధాన రహదారి నిర్మాణానికి దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలు ఆశయం నెరవేరబోతుంది. శాసన సభ్యులు అలజంగి జోగారావు ఇటీవల గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు వారాలు వ్యవధిలో బిటి రోడ్డు నిర్మాణం పూర్తి చేయుటకు అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే రహదారికి మట్టి, గ్రావెల్ లెవెలింగ్ తదితర పనులు సాగుతున్నాయని శాసన సభ్యులు తెలిపారు. గురు వారం గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన శాసన సభ్యులు నిర్మాణ పనులు, కంకర్ లెవలింగ్ పరిశీలించారు. రోడ్ లెవెల్ చేసిన అనంతరం గ్రావెల్ వేసి రోలరింగ్ చేయాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గుడివాడ నాగమణి, జెడ్పీటీసీ రవికుమార్, సర్పంచ్, ఎంపీటీసీ, మండల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు