పేదలకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం
Ens Balu
7
Bhamini
2022-05-19 13:09:08
పేదలకు అండగా ప్రభుత్వం ఉందని పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ గ్రామ సచివాలయం పరిధిలోని పాలవలస గ్రామంలో గడప గడపకు - మన ప్రభుత్వం కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి గురు వారం పాల్గొన్నారు. శాసన సభ్యులు గడప గడప కు వెళ్లి ప్రభుత్వం మూడేళ్ల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రభుత్వం వచ్చాక కలిగిన మేలును వారికి వివరించి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలవలస గ్రామానికి రచ్చబండ కావాలని ప్రజలు విజ్ఞప్తి చేయగా లక్ష రూపాయల అంచనా విలువతో రచ్చబండను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, అనధికారులు, స్థానికులు పాల్గొన్నారు.