ఆ పాఠశాల నాడు-నేడు పనుల సిమ్మెంట్ అమ్మేస్తున్నారు..


Ens Balu
2
పెద ఉప్పలం
2020-09-18 20:48:17

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపుమాట ఎలావున్నా...అక్రమార్కులకు మాత్రం మంచి కాసుల వర్షం కురుస్తుంది. యధేచ్చగా నిర్మాణాలకు ప్రభు త్వ సొమ్ముతో కొనుగోలు చేసిన సామాగ్రిని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణాలు చేపట్టేవారు దైర్యంగా తమకి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకుంటున్నారు. అలాంటి వ్యవహారం జరిగే పాఠశాల వివరాలు తెలుసుకుంటే... విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలంలోని పెద్దఉప్పలం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠ శాలకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పథకం పనులకు ప్రభుత్వం మంజూరు చేసిన సిమ్మెంటు బస్తాలను స్థానిక సిమ్మెంట్ దుఖాణం యజమా ని కోశెట్టి రాము ద్వారా, ఇంజనీరింగ్ అధికారులు బయట వ్యక్తులకు అమ్మాకలు చేస్తున్నారని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాము చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన రాంకో 43 గ్రేడ్ సిమెంట్ బస్తాలను బయట వ్యక్తులుకు అమ్ముతుండగా ఆ వ్యక్తి ద్వారా తెలుసుకున్న వివరాలను వీడియో రికార్డింగ్ కూడా చేసినట్టు ఆయన తెలిపారు. పాఠశాల పనులు పర్యవేక్షణ చేస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులే ఇలాంటి వ్యవహారాలు చేపట్టడంపై రాజు అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతేకాకుంగా సంబంధిత అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతో మంచి లక్ష్యంతో చేపట్టే కార్యక్రమాలకు వచ్చిన సిమ్మెంటు, ఇసుక, చిప్స్ ఇలా తమ అవసరాలు అమ్మేసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ఆయనచెప్పారు. పైగా ఈ విషయం పై మండల విద్యాశాఖ అధికారి ఎ.ఎన్.ఎస్.ఎ.ఎన్. మూర్తి వివరణ కోరగా, స్కూల్ ప్రహరీగోడ నిర్మాణం పంచాయతీ అధికారులు ఎం.ఎన్. ఆర్.ఇ.జి.ఎస్. పథకంలో చేపడుతున్నారని చెప్పారు. అయితే నాడు-నేడు పథకం పనుల్లో సిమెంట్ కాదని వివరణ ఇచ్చారు. కానీ ఈవిషయంపైనా, సిమ్మెంటు బస్తాలు కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పిన వీడియో రికార్డింగులపై మరింతలోతా దర్యాప్తుచేస్తే ఇంటిదొంగలు బటయపడే అవకాశం లేకపోలేదు. అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.