ప్రకృతి సిద్ధంగా లభించే పచ్చిరొట్ట ఎరువులు పట్ల రైతులకు పూర్తి అవగాహన కలిగించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె వెంకుపాలెం తగరం పూడి గ్రామాల రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. అక్కడ వివిధ అంశాలపై రైతులకు ఇచ్చే శిక్షణ సలహాల గురించి అడిగి తెలుసుకున్నారు. రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులైన పచ్చిరొట్ట ఎరువుల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి అన్నారు. అన్ని రకాల పచ్చిరొట్ట విత్తనాలు 50 శాతం రాయితీ పై అన్ని రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తున్నాయి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూరుతుందన్నారు. తగరంపూడి రైతు భరోసా కేంద్రంలో మహిళ పాడి రైతులను కలసి పాలవెల్లువ కార్యక్రమం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మహిళ సహకార డైరీ ద్వారా పాలకు ఎక్కువ ధర లభిస్తుందని వారు చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి లీలావతి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎం.శ్రీలత, జిల్లా సహకార అధికారి కిరణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.