సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి


Ens Balu
7
గుమ్మ లక్ష్మీపురం
2022-05-24 11:37:58

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమ్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు అన్నారు. గుమ్మలక్ష్మిపురం మండలం నీలకంఠాపురం, మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మంగళ వారం తనిఖీ చేశారు. ఏఎన్ఎంలు, సి.హెచ్.సిలతో మాట్లాడారు.  అకాల వర్షాలు కారణంగా సీజనల్ వ్యాధులు ప్రభలుతాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అంటువ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, అతిసార వంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే విధిగా పాటించాలని దీనిపై ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. మలేరియా ఎక్కడా ప్రభల కుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. స్ప్రేయింగ్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని మండల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు తనిఖీలు నిర్వహించాలని, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి కాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగే విధంగా అలవాటును పెంపొందించాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య చిట్కాలు తెలియజేయాలని ఆయన చెప్పారు. చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. అంటు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు ఉండాలని, ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలి ఆయన ఆదేశించారు. కోవిడ్ వాక్సిన్ వేయించాలని సూచించారు. సిబ్బంది సమయపాలన ఉండాలని, మంచి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.
సిఫార్సు