సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 29వరకు నిర్వహిస్తు న్నామని, మే 27 న రాజమహేంద్రవరం కు రానున్నదనని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర వెనుకబడిన సంక్షేమం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ తెలిపారు. స్థానిక మున్సిపల్ స్టేడియం ఆవరణలో మే 27న తలపెట్టిన సామాజిక భేరీ ఏర్పాట్లను శాసన సభ్యులు జక్కంపూడి రాజా తో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర ప్రజల ట్రాఫిక్ సమస్యకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాజమహేంద్రవరంలో సామాజిక న్యాయం సదస్సు 25 వేల మందితో నిర్వహిస్తున్నామన్నారు. కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ప్రజలు బస్సు యాత్ర ద్వారా ఈ సదస్సు కి చేరుకుంటున్నారని తెలిపారు. ఈ యాత్ర మే 29వ తేది అనంతపురం లో ముగియనున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఈ బస్సు యాత్ర విజయవంతం చేయడానికి నాలుగు చోట్ల పబ్లిక్ మీటింగ్స్ జరుగనున్నాయన్నారు. సామాజిక న్యాయాన్ని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు ఆర్థికంగా అన్నివిధాల అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రాన్ని సుధీర్ఘ కాలం పాలించిన పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీలను అణిచివేశరని వారిని ఓటు బ్యాంక్ గా మాత్రమే తప్ప రాజకీయంగా ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేశారని తెలిపారు. బీసీ లు అంటే బ్యాక్ బోన్ అని గుర్తించిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు జక్కంపూడి రాజా, ట్రాఫిక్ డిఎస్పీ లు కేవీఎన్ వరప్రసాద్, సంతోష్, సౌత్ జోన్ డిఎస్పీ ఎం.శ్రీలత,ట్రాఫిక్ సిఐ ఐ. రమణి తదితరులు ఉన్నారు.