బస్సుయాత్రను విజయవంతం చేయాలి
Ens Balu
4
Razam
2022-05-24 11:59:10
నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో తిరుగుతూ, క్షేత్ర స్థాయిలో పథకాల అమలు తీరు తెన్నులు తెలుసుకుంటూ కార్యకర్తలు విపక్షాల విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజంలోని పార్టీ కార్యాలయలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బస్సుయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అర్హులైన వారిని గుర్తించే బాధ్యత వలంటీర్లదేనని తెలిపారు. ఈ నెల 26 న నిర్వహించే - బస్సు యాత్రకు సంబందించి విజయనగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే కంబాల జోగులు పిలుపునిచ్చారు. పథకాల అమలు అన్నది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని అన్నారు. ఎవ్వరికీ ఏ లోటూ లేకుండా అవినీతికి తావే లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకే నగదు జమ చేసి, సంబంధిత ఆర్థిక లబ్ధి దక్కేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి అర్హతను అనుసరించి ఒక్కో పథకం అందుతుందని, అందరికీ అన్ని పథకాలూ వర్తించవని, దీనిని అర్థం అయ్యే విధంగా వలంటీరు చెప్పాలి అని, అదేవిధంగా వీధిలో ఉండే కార్యకర్త కూడా వివరించాలని కోరారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయల వరకూ లబ్ధి చేకూరిందని, అసలీ ఆర్థిక ప్రయోజనం అన్నది వాళ్లకు అందకుంటే ఇవాళ పేద కుటుంబాలు ఇంత హాయిగా ఉండేవా? అందుకే మళ్లీ మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూ, మీ మద్దతు ఇవ్వండి అని నాలుగు మండలాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు ముఖ్య నాయకులును కోరారు. కరోనా కాలంలోనూ ఇదే విధంగా పూర్తి బాధ్యతతో, ప్రజలకు ఆకలి దప్పికలన్నవి లేకుండా చూసిన ప్రభుత్వం ఇదేనన్న విషయాన్ని గుర్తించుకోవాలని విన్నవించారు. అదేవిధంగా ఆ రోజు బాబు చేసిన తప్పిదాలనూ ప్రస్తావించారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.