సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న సీఎం
Ens Balu
9
Seethanagaram
2022-05-24 12:08:44
సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. సీతానగరం మండలం వెంకటాపురం గ్రామ సచివాలయం పరిధిలో గల చెళ్ళంనాయుడు వలస గ్రామంలో మంగళ వారం శాసన సభ్యులు అలజంగి జోగారావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను నిర్వహించారు. ప్రజా సంక్షేమమే పరమావదిగా, గ్రామాల అభివృద్దియే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజాబాట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజల ఆశీర్వాదము పొందుతుందని ఆయన అన్నారు. ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వం అందించిన పథకాలు తద్వారా కుటుంబాలు పొందిన లబ్దిని వివరించారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని వాటిని సకాలంలో పరిష్కారం చేస్తామని చెప్పారు. పేదల సంక్షేమం కోసమే నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పేదలు అందరికీ ఇళ్ళు, అరోగ్య శ్రీ, విద్యా, వైద్య తదితర అన్ని రంగాల్లో పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.