ఇళ్ళు నిర్మించండి..గృహ ప్రవేశం చేయండి


Ens Balu
4
Parvathipuram
2022-05-24 13:55:37

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేయాలని సీతంపేట ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. నవ్య పిలుపునిచ్చారు. పాలకొండ పట్టణ లబ్ధిదారులతో మంగళ వారం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో అవగాహన సదస్సును ప్రాజెక్టు అధికారి నిర్వహించారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ పేదలు అందరికీ సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. ఈ మేరకు పాలకొండ పట్టణంలో అర్హులకు లుంబూరు లే అవుట్ లో గృహాలు మంజూరు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. బిల్లుల సమస్య లేదని, లే అవుట్ లో నిర్మాణాలకు అవసరమగు సామగ్రి అందుబాటులో ఉంచడంతోపాటు విద్యుత్, నీరు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాలకు అనుకూలమైన వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తూ మంజూరు చేసిందని ఒక్కో స్థలం, గృహం కనీసం రూ.25 లక్షలు విలువ చేస్తుందని అన్నారు. సొంత ఇళ్ళు కలిగి ఉండటం కల అని దానిని సాకారం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు