ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ పరిశుభ్రత తమదిగా భావించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లిఖార్జున పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆనందపురం మండలం ఆనందపురం గ్రామంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీని చూడచక్కని గ్రామ పంచాయతీగా మార్చుట కొరకు ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం swpc షెడ్ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ప్రజలకు చెత్తను వేరు చేసి ఎరువులను మరియు ఆదాయం ను సమకూర్చుట గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి రెండు బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఆకు పచ్చ తడి చెత్తకు, నీలం పొడి చెత్తకు ఉపయోగించాలి అని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను పునః వినియోగ కేంద్రాలకు తరలించి గ్రామమును ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి అన్నారు.తడి చెత్తను హరిత రాయబారులు ద్వారా ఆరోగ్య కరమైన సేంద్రియ ఎరువులను తయారు చేయాలన్నారు. కొంత నిర్ణీత సమయాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా వ్యాపార కూడళ్లు నుండి అధికంగా చెత్త వస్తుందని, తగు ప్రణాళికలు తో సంపద కేంద్రాలకు తరలించాలి అన్నారు. వ్యర్ధాలు పేరుకుంటే రక రకాల వ్యాధులకు గురికావలసి వస్తుందని తెలిపారు.
ఈ విషయాలపై విద్యార్థులకు, మహిళలకు తరచుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్ని అడిగి వివిధ పారిశుధ్య సమస్యలను పరిశీలించి దాని పరిష్కారం ప్రణాళికను తయారు చేయుటకు మార్గనిర్దేశం చేశారు. గ్రామంలో అవసరమైన సామగ్రి , సిబ్బంది వివరాలు సచివాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఎప్పటి కప్పుడు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. కాలువల నిర్మాణాలకు ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. తరువాత మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణ కుమారి, ఎంపీపీ మజ్జి శారద ప్రియాంక, జడ్పిటిసి కొరాడ వెంకట్రావు , సర్పంచ్ చందక లక్ష్మి , ఎంపీడీవో, తాసిల్దార్ ,మరియు మండల పంచాయతీ కి చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.