ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.. ప్రభుత్వ జనరంజక పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమదాలవలస బ్రిడ్జి డౌన్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అయన పూలమాలవేసి కేక్ కట్ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాతూ మూడేళ్లలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.వృద్ధులకు పింఛన్లు, పేదలకు రేషన్ మొదలుకుని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని పునరుద్ఘాటించారు.కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. యువతకు ఉపాధి కల్పన, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, జగనన్న విద్యా దీవెన, విద్యాకానుక, అమ్మఒడి, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవటంతో పాటు విమానాశ్రయాలు,నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి.. అంతే స్థాయిలో సంక్షేమాన్ని అందించటమే సీఎం ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారన్నారు. ప్రజల్లో తన స్థానాన్ని మరింత పదిల పరుచుకొని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎంతో నిబ్బరంగా పాలన సాగిస్తున్నారన్నారు.ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలు అమలు పరుస్తూ...మూడేళ్లుగా ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.నేను విన్నాను... నేను ఉన్నాను..అంటూ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తానంటూ ఇచ్చిన భరోసా అనుగుణంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. మూడేళ్లుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామల రావు, దుంపల చిరంజీవి, గురుగుబెల్లి శ్రీనివాసరావు, మామిడి ప్రభాకర్,కూసుమంచి శ్యాం ప్రసాద్, పొన్నాడ చిన్నారావు, తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.