ఉపాధి పనులను పరిశీలించిన డ్వామా పిడి


Ens Balu
4
Echherla
2022-05-31 13:36:27

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎం.రోజా రాణి మంగళవారం పరిశీలించారు. చిలకపాలెం, చిన్నరావుపల్లి తదితర ప్రాంతాలను విస్తృతంగా పర్యటించి ఉపాధి హామీ పనుల తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధి కూలీలతో మాట్లాడుతూ రెండు పూటలా నిర్దేశించిన పని చేసినట్లయితే వేతనదారులు గరిష్ఠవేతనం రూ.250/-లకు పైగా  పొందవచ్చని ఆమె సూచించారు. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, మీరు చేసిన పనులు మీ గ్రామానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె వేతన దారులను ఉద్దేశించి అన్నారు. జాబ్ కార్డు ఉన్న వారందరికీ వందరోజుల పని దినాలు కల్పించే విధంగా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఏపీఓ,సాంకేతిక సహాయకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు