శ్రావ్య బయోటెక్ తో విషవాయువుల నరకం..


Ens Balu
2
s.rayavaram
2020-09-19 13:22:49

గ్రామం మధ్యలోనే రసాయనాల కర్మాగారం...ప్రతినిత్యం వ్యర్ధ రసాయానాలతో భూములు, చెరువులు కలుషితం...చుట్టుప్రక్కల ప్రజలకు వాటి నుంచి వచ్చే విషవా యులతో అనారోగ్యం...ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు ఆ రసాయన కర్మాగరం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, యస్.రాయవరం గ్రామంలో పాత సినిమాహాలు వెనుక సర్వే నెంబర్ 105బై1బి, గవరవీధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా శ్రావ్య బయోటెక్ అనే రసానాయన కర్మాగారం నిర్వహిస్తున్నారని సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,  ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఎటువంటి అనుమతులు లేకుండా శ్రావ్య బయోటెక్ అనే రసాయనాల మందులు తయారు చేసే కర్మాగారాన్ని గ్రామ మధ్యలో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనివలన గ్రామప్రజలకు శ్వాసకోశ వ్యాధులతోపాటు, చర్మరోగాలు వస్తున్నాయని వివరించారు. ఈ కర్మాగారం ద్వారా బయటకు వచ్చే రసాయన వ్యర్ధాలతో చెరువులు, కాలువలు, కలుషితం అవుతున్నాయని, బొర్లులలో మంచినీరు రషాయనాల వాసన వచ్చి త్రాగడానికి వీలులేకుండా వుందని చెప్పారు. ఈ విషయమై అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ బయోటెక్ రసాయనాలు, వాయువులతో ప్రాణాలతో చాలగాట మారుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఇలాంటి అనధికార విషపూరిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ కంపెనీ యస్.రాయవరం మండలం వైస్సార్ పార్టీ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తమ్ముడు, భీమరశెట్టి యుగంధర్ భార్య బీమరశెట్టి రజని ప్రొప్రైటర్ గా ఉన్నారనే వివరాలను రాజు మీడియాకి వెల్లడించారు. కాలుష్య నియంత్రణ అధికారులు వచ్చి తనిఖీలు చేస్తే, ఈ కర్మాగారం ద్వారా ఏ తరహా విషవాయువులు వస్తున్నాయో తెలుస్తుందన్నారు. ఈ రసాయన కర్మాగారంపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.