ఈవీఎం గోదాముల ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్


Ens Balu
6
Nellimarla
2022-06-03 08:53:33

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఈవీఎంల గోదాముల ఆవరణలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మొక్కలు నాటారు. నెలవారీ తనిఖీలో భాగంగా శుక్రవారం ఆమె గోదాములను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పటిష్ఠ భద్రత కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విజిటింగ్ బుక్ లో కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం డి.ఆర్.వో. ఎం. గణపతిరావు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మహేష్ లతో కలిసి గోదాముల ఆవరణలో వివిధ మొక్కల్ని నాటి నీరు పోశారు. కార్యక్రమంలో నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, తహశీల్దార్, ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
సిఫార్సు