వ్రుద్ధుల్లో వెలుగులు నింపిన విశాలాంధ్ర
Ens Balu
5
Devarapalli
2022-06-07 08:20:47
విశాలాంధ్ర 70వ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలం కలిగోట్ల గ్రామంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వ్రుద్ధులకు, చిన్నాలరుకు కంటి పరీక్షలు నిర్వహించారు. విశాఖజిల్లా బ్యూరో పి.రామకృష్ణ, దేవరాపల్లి మండల రిపోర్టర్ గొర్రుపోటువాసు, ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో ఉన్న అనేక మంది వృద్ధులు, చిన్నారులు, వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ వైద్య శిబిరం లో పాల్గొన్నారు. శంకర్ ఫాండేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ఈ ఉచిత కంటి శిబిరం లో పరీక్షలు జరిపి అవరమైన వారిని ఆపరేషన్లు చేయించేందుకు విశాఖలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరికొందరికి మందులు పంపిణీ చేశారు. కలిగొట్ల గ్రామంతో తోపాటు చుట్టుపక్కల వాకపల్లి, తిమిరాం, అర్జునగిరి, బోయల కింతల, కొత్తూరు, గవరవరం, వేచలం గ్రామాల నుండి 300 మందికి పైగా ప్రజలు వైద్యసేవలు పొందారు.