అప్పన్నకు 3వ విడత చందన సమర్పణ


Ens Balu
3
Simhachalam
2022-06-13 07:33:20

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామికి మంగళవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా  మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. సోమవారము నృసింహ జయంతి సందర్భముగా అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సింహాద్రి నాధుడుని  దర్శించుకున్నారు. ఈ నేపధ్యంలో చందాన సమర్పణ వివరాలు వెల్లడించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు అప్పన్న నిజరూప దర్శనం రోజు రాత్రికి తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించారు.. ఆ తర్వాత వచ్చే వైశాఖ ,జ్యేష్ఠ ,ఆషాఢ పౌర్ణమిల లో మూడేసి మణుగుల చొప్పున ఏడాదిలో నాలుగు విడతల కింద 12 మణుగుల చందనాన్ని(500కేజీ లు) స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.ఈ నేపథ్యంలో మంగళవారం నాడు  చందన సమర్పణ కి  ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ  ఆధ్వర్యంలోఅర్చక వర్గం, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదిలా ఉండగా సోమవారం సింహగిరి పై నరసింహ స్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ అర్చక పరివారము స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలు నిర్వహించింది


శ్రీనుబాబు కు ఘనసత్కారం

అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ల  ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఘనంగా సత్కరించాయి.. తన సేవలను గుర్తించి సన్మానించిన వారికి శ్రీను బాబుప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సిఫార్సు