ఎస్.పైడిపాల కొండల్లోనే పులి సంచారం


Ens Balu
3
Rowthulapudi
2022-06-24 13:15:52

కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల అడవుల్లోనే పులిసంచారం వుందని జిల్లా అటవీశాఖ అధికారి రాజు వెల్లడించారు. శుక్రవారం పులి ఆచూకీ కోసం అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిసి టీవీలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత రెండు రోజులుగా పశులపై పులి దాడి చేస్తుందని ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఎవరూ రాత్రి సమయంలో అటవీ ప్రాంతం గుండా వెళ్లవద్దని హెచ్చరించారు. పులి ఈ ప్రాంతంలోనే తిరుగుతుందని దాని పాద ముద్రల ద్వారా ఒక అంచనాకి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన సిసి కెమెరాల ఫుటేజీలు పరిశీలించిన అనంతరం మరికొన్నింటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రం సమయంలో గ్రామ శివారుల్లోగానీ రైతులు పశువుల మేతకు కూడా తీసుకెళ్లవద్దన్నారు. పులి సంచారం పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని..కాగా ప్రస్తుతం ఈ గ్రామంలో అటవీశాఖ సిబ్బంది పహారా ఉంటుందని ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని అన్నారు.  గ్రామానికి చెందిన రైతులకు చెందిన పశువులను భద్రమైన ప్రదేశాల్లోనే పులి దొరికేవరకూ ఉంచాలని జిల్లా అటవీశాఖ అధికారి రాజు ఎస్.పైడిపాల వాసులకు సూచించారు.
సిఫార్సు