వడి వడిగా టీడీపీ సభ్యత్వ నమోదు
Ens Balu
5
ప్రత్తిపాడు
2022-06-24 13:25:41
ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వడివడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని టిడిపి నాయకులు మిరియాల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ప్రత్తిపాడు మండలం, చిన శంకర్లపూడి గ్రామంలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. నియోజవర్గ ఇంఛార్జి వరుపుల రాజా గారి పిలుపు మేరకు కార్యక్రమాన్ని నాలుగు మండలాల పరిధిలో పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. ప్రతీరోజూ సుమారు 100 నుంచి 130 మంది సభ్యత్వ నమోదు ఆన్ లైన్ లో జరుగుతుందని శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు అప్పారావు, శ్రీను, వంశీ, రాము తదితరులు పాల్గొన్నారు.