పార్టీ అభివ్రుద్ధి కోసం కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు పెద్ద పీట వేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ పేర్కొన్నారు. యలమంచిలి నియోజకవర్గ ప్లీనరీ సమావేశం శనివారం అచ్చుతాపురంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అమర్ నాధ్ మాట్లాడుతూ, కార్యకల శ్రమ, జగన్ కాయకష్ట మీద పార్టీ ఎదిగిందే తప్ప, ఏసాను భూతిని అడ్డు పెట్టుకొని పైకి రాలేదని ఆయన అన్నారు. వైసిపీ జెండా నీడలో మనమంతా ఎదిగామన్న వాస్తవాన్ని కార్య కర్త లు, నాయకులు గుర్తించాలని, తన వల్లే పార్టీ నడుస్తోందని యెవ్వరు భావించవద్దని మంత్రి అమర్ హితవు పలికారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి, ఒంటరి పోరుతో జగన్ అధికారంలోకి. వచ్చారని ఆయన అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హాయాంలో ప్రవేశపెట్టిన పథకం ఏ ఒకటైన జనానికి గుర్తుందా? అని అమర్ ప్రశ్నించారు.
బాబు పేరు చెడితే వెన్నుపోటు తప్ప జనానికి మరేదీ. గుర్తు రాదని ఆయన విమర్శించారు. జగన్ని జైలుకు పంపించాలని, సోనియాతో కలసి చంద్రబాబు కుట్రలు పన్నినా, జగన్ మొక్క ఓని ధైర్యంతో జనాల మధ్యకు వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. వచ్చే రెండు నెలల్లో సీఎం జగన్ అచ్చుతాపురం ప్రాంతానికి రానున్నారని, ఇక్కడ సుమారు రెండు వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కర్మగారాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని అమర్ చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ధర్మశ్రీ మాట్లాడుతూ గుడివాడ గురునాధరావు ను, అమర్ నాథ్ లో చూస్తున్నామని, అనకాపల్లి నియోజకవర్గంలో వారి కుటుంబానికి ప్రత్యేక స్థానం వుందని అన్నారు.అర్హత వున్న వాళ్లకు పథకాలు ఇచ్చారని, అందులో ఎటువంటి అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గానికి ఈ మూడేళ్లలో 831 కోట్ల విలువైన పథకాలు అందాయని చెప్పారు. గడప గడపకూ వైసిపి కార్యకర్తలు వెళుతుంటే ప్రజలు చిరు నవ్వుతో స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. ఈ సమువేశంలో డి సి సి బి మాజీ చైర్మన్ సుకుమార వర్మ ఎం.పి. సత్యవతి, సతీష్ వర్మ, బొడేటిప్రసాద్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.