బైకెనక బైకులెట్టి.. YSRCPప్లీనరీకి దారికట్టి


Ens Balu
3
Krishnadevipeta
2022-06-27 08:50:37

గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురం గ్రామ సర్పంచ్ రఘురామ్ ఏం చేసినా అది వినూత్నంగానే వుంటుంది. ఎల్లప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను ప్రజలకు చేర్చడంతోపాటు, సోషల్ మీడియాలోనూ చురుకుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా నర్సీపట్నం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి కూడా యువతను వెంటబెట్టుకొని..బైకెనక బైకులెట్టి ప్లీనరీకి తరలి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమం అయినా సర్పంచ్ రఘురామ్ దగ్గరుండి యువతను, కార్యకర్తలను వెంటబెట్టుకొని తీసుకెళ్లడం గొలుగొండ మండలంలోనే హైలేట్ గా నిలుస్తుంటుంది. వైస్సార్సీపీ ప్లినరీ సమావేశానికి  బైక్, ఆటోలలో మహిళలంతా కలిపి 50మంది వరకూ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సిఫార్సు