ఉచిత ఆధార్ సేవలు వినియోగించుకోవాలి
Ens Balu
3
Sankhavaram
2022-06-29 07:51:12
ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడ్ సేవలను 5నుంచి 15 సంవత్సరాల లోపు విద్యార్ధినీ, విద్యార్ధుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్వచంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం-1లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్ర సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్కూలు పిల్లల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధార్ అప్డేట్ కార్యక్రమం ఉచితంగా చేపట్టిందన్నారు. దానికోసం గుర్తించిన గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సేవలను అందిస్తుందన్నారు. ఆధార్ అప్డేడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో వీలుగా వుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ పర్వత రాజు బాబు ,ఎంపిడిఓ రాంబాబు,సర్పంచ్ బందిలి గన్నియమ్మ,ఎంపీటీసీ సభ్యులు వీరబాబు, పంచాయతీ కార్యదర్శులు,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు, పిల్ల తల్దిదండ్రులు పాల్గొన్నారు.