ఆలిండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నర్సీపట్నం బేస్ క్యాంపు ఎల్ఐసీ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా జరిగిగాయి. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి కె.కేశవభద్రపడాల్, అధ్యక్షులు విసిహెచ్ఎన్.రాజు ఆధ్వర్యంలో అసోసియేషన్ జండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యదర్శి పడాల్ మాట్లాడుతూ, ఉద్యోగుల కోసం అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను, ప్రాధాన్యతను వివరించారు. ప్రతీ ఒక్క సభ్యుడు యూనియన్ అభివ్రుద్ధికి క్రుషిచేయడంతోపాటు, కలిసికట్టుగా పనిచేసి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సంఘం బలోపేతానికి నడుంబిగించి ముందుకు సాగాలన్నారు. ఏఐఐఈఏ లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం సభ్యులకు, ఏజెంట్లకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ ఎస్ ధనార్జన్, ఏఏఓ దశధరధరామయ్య, డీఓ శ్రీనివాస శర్మ, ఏజెంట్స్ లీడర్ శ్రీరామ్మూర్తి, ఉద్యోగులు, ఎల్ఐసీ పాలసీ దారులు పాల్గొన్నారు.