దేవాలయాల్లో మంచినీటి కుళాయిలు


Ens Balu
16
Simhachalam
2022-07-01 16:09:55

విశాఖ జీవీఎంసీ పరిధిలోని 93వ వార్డు పరిధిలోని పలు దేవాలయాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆవార్డ్ కార్పొరేటర్ రాపర్తి కన్నా తెలిపారు. శుక్రవారం సింహాచలంలోని అప్పన్న సోదరి, శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయం లో తాజాగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ పలు దేవాలయాల్లో మంచినీటి  కొలాయలు  సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు భవిష్యత్తులో విరాట్ నగర్, సాయి మాధవ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వార్డ్ ను పూర్తి స్థాయిలో .అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సత్తెమ్మ తల్లి ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు , అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అప్పన్న సోదరిగా, పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న ఈ ఆలయాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పీ. వెంకట రావు, బలిరెడ్డి శ్రీనివాస రావు , గ్రామ పెద్దలు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

సిఫార్సు