గ్రామాల్లో మునగ సాగును ప్రోత్సహించాలి


Ens Balu
6
Echherla
2022-07-02 10:40:02

శ్రీకాకుళంజిల్లాలో మునగ తోటల సాగును ప్రోత్సహించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎం.రోజారాణి  అధికారులను ఆదేశించారు. శనివారం ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించిన ఆమె కూలీలు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, మునగ తోటలు సాగువలన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని అన్నారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో మునగ తోటలు వేసుకునే వెసులుబాటును ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. రైతులు, ఉపాధి హామీ పథకం కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మునగ తోటల సాగుకు కనీస విస్తీర్ణం 25 సెంట్లు భూమి ఉండాలని ఆమె సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మునగ తోటల పెంపకానికి చర్యలు చేపట్టాలని సిబ్బందిని కోరారు. పని ప్రదేశాల వద్ద మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రతి జాబ్ కార్డుదారుడు పనికి వచ్చేలా చూడడంతో పాటు గరిష్ట వేతనం కూలీలకు అందేలా చూడాల్సిన బాధ్యత సిబ్బందిదేనని ఆమె అన్నారు. పిడి వెంట ఏపీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
సిఫార్సు