హౌసింగ్ లక్ష్యాలు మరింత పెంచాలి
Ens Balu
3
Srikakulam
2022-07-05 12:25:29
శ్రీకాకుళం జిల్లాలో వారంలో నిర్ణయించిన లక్ష్యాలు మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణాల పురోగతి పై ఇఇ, డిఇ, ఎఇ లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న నవరత్నాలలో భాగంగా గృహ నిర్మాణాలపై లబ్ధిదారులను అవగాహన పరచి గృహ నిర్మాణాలు వేగం పెంచాలన్నారు. వారంలో నిర్ణయించిన లక్ష్యాలను అధికమించాలని ఆదేశించారు. సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సహాయం తీసుకోవాలని చెప్పారు. నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ యన్. గణపతిరావు, ఇఇ, డిఇ, ఎఇలు పాల్గొన్నారు.