వ్యాధుల సోకకుండా జాగ్రత్త వహించాలి
Ens Balu
7
Sankhavaram
2022-07-06 15:18:27
పాడి పశువులు, పశుపక్షాదులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మనోజ్ కుమార్ రైతులకు సూచించారు. బుధవారం జునోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు ఫ్రీ వ్యాక్సిన్ కార్యక్రమం మండల కేంద్రమైన శంఖవరం పశువుల ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాడి పశువులకు పశుపక్షాదుల పట్ల ఎంతో మెలకువగా ఉండాలన్నారు. వాటికి వచ్చే జబ్బులకు వారి యజమానులకు తగు సలహాలు అందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎల్లప్పుడూ గ్రామీణ పశుసంవర్ధక సహాయకులు అందుబాటులో ఉంటారని, వారి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి డాక్టర్ ఎం.వీరరాఘవ, హాస్పటల్ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.