మహిళలకు దిశయాప్ తో స్వీయ భద్రత


Ens Balu
6
Sankhavaram
2022-07-06 16:31:43

మహిళలు తాము వినియోగించే ఆండ్రాయిడ్ ఫోన్లలో దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా స్వీయ భద్రత పొందవచ్చునని శంఖవరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-1 మహిళా పోలీస్ జి.ఎన్ఎస్.శిరీష పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఆపదలో వున్నవారిని రక్షించేందుకు తీసుకువచ్చిన దిశయాప్ ను ఆడ, మగ తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ తమ ఫోన్ లలో ఇనిస్టాల్ చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే విద్యార్ధినిలు, విధి నిర్వహణలో నిత్యం ప్రయాణాలు చేసే మహిళా ఉద్యోగినిలు, గ్రుహిణిలు ఈ దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా అత్యవసర సమయంలో పోలీసుశాఖ ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. ఆపదలో వున్న సమయంలో ఎస్.ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు ఫోన్ వెళుతుందని..వెంటనే పోలీసులు అప్రమత్తమై తిరిగి వెంటనే ఫోన్ చేసి విషయం తెలుసుకోవడంతోపాటు, రక్షణ కల్పిస్తారని అన్నారు. మహిళలకు రక్షణ కవచంగా వుండే ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఎంతో రక్షణగా వుంటుందన్నారు. అదేవిధంగా యువత కూడా దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి, పోలీసుల సహాయంతో కాపాడటానికి ఆస్కారం వుంటుందని తెలియజేశారు. ప్రతీ ఒక్కరూ దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకి రావాలని మహిళా పోలీస్ జి.ఎన్ఎస్.శిరీష మీడియా ద్వారా ప్రజలకు సూచించారు.
సిఫార్సు