ప్రైవేటులోను యాప్స్ ఉచ్చులో పడకండి


Ens Balu
7
Kakinada
2022-07-07 08:18:39

అనుకున్నదే తడవుగా రుణం లభించి క్షణాల్లో, ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో అవసరం లేకపోయినా జల్సాలకు గాను పలువురు యువకులు లోను యాప్  ద్వారా రుణం పొంది అప్పుల పాలవుతున్నారని  న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని శేషాద్రి నగర్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సెల్ ఫోను ద్వారా రుణం కావాలా అంటూ అడగడంతో వాటి నియమ నిబంధనలు పరిశీలించకుండా ఆధార్,  బ్యాంకు ఖాతా,  పాన్ కార్డు నెంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని  యాప్ ల నిర్వాహకులకు ఇస్తున్నారన్నారు. రుణం సకాలంలో చెల్లించకపోతే ఇష్టం వచ్చినట్లు వడ్డీలు, పెనాల్టీలు వేసి పెద్ద మొత్తాన్ని గుంజుతున్నారని అన్నారు. డబ్బులు చెల్లించక పలువురు యువకులు మానసికంగా వేదనకు గురవుతున్నారని అన్నారు. అత్యవసరమైతే తప్ప లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకోరాదని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు