బక్రీద్ సందర్భంగా జంతు, గోవధలను నిషేధించినట్లు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శాంతి శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన బక్రీద్ పండగ సందర్భంగా గోవులు, ఒంటెలు వదించకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఆవులను చంపివేసే ప్రమాదం ఉన్నందు వలన ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్డ్ టు ఏనిమల్ ఆర్ట్ 1960 & AP Prohibition of Cow Slaughter and Animal Prevention Act 1977 & PCA Rules-2000 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండి 10వ తేదీన ఆవులను, ఒంటెలను క్రూరంగా నరికివేయకుండా, జంతు వధ ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జంతు వధ ప్రాంతాలకి తరలించకుండా చెక్ పోస్టుల ద్వారా పోలీసులు తనిఖీ చేసి ఆపాలన్నారు. జంతు వధ కొరకు ఆవులు, ఒంటెలు, తదితర జంతువులు అమ్మకాలు, కొనుగోలు నిషేదిస్తున్నట్లు పేర్కొన్నారు. జంతు వధ (గోవధ) కి ప్రయత్నించు వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీలలో గోవధ, ఒంటెల వధ నిషేధమని తెలియజేస్తూ ముఖ్య కూడలిల వద్ద ముఖ్యంగా బక్రీదు సమయంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
జంతు వధ నిషేధం కొరకు జంతువుల కొనుగోలు, అమ్మకాలు నిషేధం ప్రకటించి, అమ్మకాలు జరిగే ప్రాంతంలో అమ్మకాలు నిలుపుదలకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జంతువులు, గోవులు, తదితరమైనవి వాహనాలలో తరలించకుండా రవాణా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, తగిన సిబ్బందితో చెక్ పోస్టు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒంటెలు, గోవులు వధ నిషేధం - జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించరాదని తెలుపుతూ విద్యార్థులచే ర్యాలీలు చేపట్టేందుకు విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గో వధ, జంతు వధ నిషేధంపై అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గోవులు, ఇతర జంతువులను తరలించకూడదని ప్రచారం నిర్వహించాలని, బక్రీద్ సమయంలో గో వధ నిషేధంపై ప్రజలను అప్రమత్తం చేయుటకు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని శాఖలను పశు సంవర్థక శాఖ అధికారులు సమన్వయ పరచి జంతు సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు. బక్రీద్ సందర్భంగా జంతు, గో వధ నిషేధంపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.