పరిమిత కుటుంబంతోనే ఎంతో మేలు


Ens Balu
7
Kakinada
2022-07-11 09:56:54

మానవ వనరులలో జనాభా ముఖ్యమని అయితే అధిక జనాభా వలన ఆహార పదార్థాల కొరత, పేదరికం, ఉపాధి లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు తీర్చగలిగే స్థాయిలో వనరులు అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజల ఆకాంక్షలు,  ఆశలు అపరిమితంగా ఉంటున్నాయన్నారు. పరిమిత జనాభా వలన పేదరికం తగ్గడంతో పాటు వనరులన్నీ సమృద్ధిగా అందరికీ లభిస్తాయని అన్నారు. అందుచేతనే ప్రభుత్వం ఇద్దరు లేక ముగ్గురు కార్యక్రమాన్ని ప్రకటించి ఆ దిశగా ప్రోత్సాహకాలు అందిస్తుందని  కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు