రానున్న శ్రావణమాసం ప్రతి ఇంటా నోములు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ కళకళలాడను న్నాయని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సోమవారం సర్పవరం జంక్షన్ లో విశ్రాంతి తాసిల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. పట్నాయక్ మాట్లాడుతూ మహిళా లోకమంతా భక్తిశ్రద్ధలతో చేసే అనేక వ్రతాలలో వరలక్ష్మి వ్రతం అతి గొప్పదని ఈ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని అన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని నూతన వస్త్రాలు సమకూర్చిన బాపిరాజు సేవా తత్పరత అభినందనీయమని పట్నాయక్ తెలిపారు .ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.