ప్లాస్టిక్ సంచులను వినియోగిస్తే కేసులే
Ens Balu
9
Kakinada
2022-07-11 09:58:45
హానికర ప్లాస్టిక్ తయారీ, వినియోగాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిషేధించిందని దీనిని ఉల్లంఘిస్తే కేసులు బారిన పడే అవకాశం ఉందని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని రమణయ్యపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 16 రకాల సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం నిషేధించిందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువులు మానవ జీవితంలో మమేకమయ్యాయని అయితే వాటిని రోడ్లపై కాలువల్లో పడేస్తుండడం వలన మురుగు కాలువల్లో మురుగునీరు ముందుకు పోవడం లేదన్నారు. అదే విధంగా వ్యర్ధాలను ప్లాస్టిక్ సంచుల్లో వేసి రోడ్లపై పాడేయడం వలన ఆవులు తదితర జంతువులు వాటిని తినడం వలన పశువుల జీర్ణవ్యవస్థ పనిచేయక మరణిస్తున్నాయని అన్నారు. భూ కాలుష్యానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వస్తువులు వినియోగమని అన్నారు .మార్కెట్ కి వెళ్లేటప్పుడు జూట్ లేదా గుడ్డ సంచులను తీసుకువెళ్లడం మేలని యనముల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.