బాలలను తప్పనిసరిగా బడికి పంపాలి


Ens Balu
2
Kakinada
2022-07-12 07:33:25

బాలల బంగారు భవిష్యత్తుకు బాట వేయడానికి గాను బడి ఈడు పిల్లలను  విధిగా పాఠశాలకు పంపాలని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని శేషాద్రి నగర్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బాలలకు  నిర్బంధ ప్రాథమిక విద్య అమలులో ఉన్నందున సద్వినిపరచుకోవాలని అన్నారు. 14 ఏళ్లలోపు బాలలను ప్రమాదకర పనిలో పెట్టుకోవడం నేరమన్నారు. మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలకమైన దశని వాళ్లు సుఖంగా, సంతోషంగా ఉండేలా చేయడం పెద్దల కర్తవ్యం అని అన్నారు. బాలలకు రాజ్యాంగమే రక్షణ కల్పించిందని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు