జిల్లాలో నిర్మాణాలు వేగవంతం చేయాలి
Ens Balu
5
దేవరాపల్లి
2022-07-12 10:06:38
ప్రణాళిక బద్ధంగా ముందస్తుగా నిర్మిస్తున్న కట్టడాలు భావితరాల అనువుగా ఉంటాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. మంళవారం అనకాపల్లి జిల్లా దేవారపల్లి మండలం, తారువ గ్రామంలో ని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో మౌళిక నిర్మాణాలు, బిటి రోడ్లు, సి.సి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై మాడుగుల నియోజకవర్గంలోని (దేవారపల్లి, కె.కోటపాడు, చీడికాడ, మాడుగుల) నాలుగు మండలాల పంచాయతీరాజ్ & ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు చేపట్టిన నిర్మణాల వల్ల వాటిని పునర్నిర్మాణం చేయడం తప్పనిసరి అవుతుందని, జగన్ ప్రభుత్వం లో చేపట్టే ఏ నిర్మాణమైన భవిష్యత్ అవసరాలకు అనువుగా ఉండాలని అధికారులను ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటనలో గుర్తించిన సమస్యలను, త్వరితంగా పరిష్కరించాలని ఆదేశించారు. నాడు-నేడు పనులు, జిల్లాలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు తదితర అత్యవసర నిర్మాణాలు ఏమేరకు పూర్తయ్యో మండలాల వారీగా నివేదికలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.