స్వచ్ఛంద సేవలు అభినందనీయం


Ens Balu
2
Simhachalam
2022-07-12 10:34:00

సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ లు  చేసే భక్తులకు జన్మ జన్మల పుణ్య ఫలం లభిస్తుందని అప్పన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే భూఫల ప్రదక్షిణ తో సమానం అనీ పురాణ ఇతిహాసాల కథనం. ఈ నేపథ్యంలోనే  మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు కాలినడకన తమ గిరిప్రదక్షిణ యాత్రను ప్రారంభించారు. సుమారు 32 కిలోమీటర్ల పొడవునా భక్తులు కాలినడకన తమ  ప్రదక్షిణలు పూర్తిచేస్తారు. సింహాచలం దేవస్థానం, పోలీస్, రెవెన్యూ జీవీఎంసీ, అధికార యంత్రాంగాలు అన్ని భక్తులు కు విశేష సేవలు అందిస్తున్నాయి. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో సింహగిరి చుట్టూ పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. ఇక్కడ గోశాల జంక్షన్ లో ఎస్ ఎన్ ఆర్ కళ్యాణమండపం అధినేత బీవీ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాదాలు, బాదం పాలు, మజ్జిగ  కౌంటర్లను  జోన్  8 జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు  మాట్లాడుతూ భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థల సేవలు  ప్రశంసనీయం అని కొనియాడారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులతోపాటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు అంతే పుణ్యం లభించాలని వీరు ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో చంద్ర మౌళి, గంట్ల కిరణ్ బాబు,ఈశ్వర్..సీతారామయ్య. విష్ణు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు