వ్యాపారుల ప్రత్యామ్నాయం చూసుకోవాలి


Ens Balu
8
Kakinada
2022-07-13 10:25:14

పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో రైతు బజార్లు, మార్కెట్లు, వ్యాపార సంస్థల నిర్వాహకులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కే రమేష్ కోరారు. ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం ఆయన రమణయ్యపేట మార్కెట్ ను సందర్శించారు. అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న పర్మనెంట్ కార్మికులను అన్ని ప్రాంతాలకు విభజించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. అయితే చెత్త అధికంగా ఉత్పత్తి అయ్యే వ్యాపార వాణిజ్య సముదాయాలు,మార్కెట్లలో మాత్రం అక్కడి నిర్వాహకులు  సమ్మె పరిష్కారం అయ్యేవరకు సొంతంగా కార్మికులను ఏర్పాటు చేసుకుని చెత్తను సేకరించి కార్పొరేషన్ వాహనాలకు అందజేయాలని కమిషనర్ కోరారు. చెత్తను రోడ్ల ప్రక్కన డ్రైన్ ల లోను వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఓవైపు కార్మికుల సమ్మె తో పాటు, వర్షాలు కూడా పడుతున్నందున  ప్రజలు సహకరించకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మురికి నీటిపారుదల లేక డ్రైనేజీలు స్తంభించి దోమలు పెరగడం, ప్రజల అనారోగ్యాల పాలవడం వంటి ఇబ్బందులు. తలెత్తుతాయన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్ రమేష్ కోరారు. కమిషనర్ వెంట కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృద్వి చరణ్ తదితరులు ఉన్నారు.
సిఫార్సు