మద్దూరు లంక గ్రామంలో జెసి పర్యటన


Ens Balu
7
మద్దూరులంక
2022-07-13 10:37:28

వరదలు కారణంగా ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణ ఆస్థి నష్టం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొవ్వూరు మండలం మద్దూరు లంక గ్రామంలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మద్దూరు లంక గ్రామంలో వరద ప్రభావం మూలంగా గట్ల పరిస్థితి పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీటి వసతి కల్పించాలన్నారు. పరిస్థితి అనుగుణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. పునరావాస కేంద్రంలో అత్యవసర మందులను , ఓ ఆర్ ఎస్ ప్యాకేట్లు ను సిద్దం గా ఉంచాలని సుంచించారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, మద్దూరులంక ప్రాంతంలో బలహీనంగా ఉన్న బండ్ వద్ద ఇసుక బస్తాలు, ఇతర రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని, ఇరిగేషన్ అధికారులు సూచనలకు అనుగుణంగా చర్యలు పూర్తి చేసినట్లు వివరించారు. ఈ పర్యటనలో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డి ఎస్పీ బి. శ్రీనాథ్,  తహశీల్దార్ బి. నాగరాజు నాయక్,  ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు