జగనన్న కాలనీ లలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలనీ, అదే విధంగా మౌలిక వసతుల కల్పన కూడా వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ విజయనగరం మండలం రూరల్, అర్బన్ లోని పలు లేఔట్లను, టిడ్కో గృహాలను రెవిన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్ , మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడుతో కలసి పరిశీలించారు. తొలుత గుంకలాం లేఅవుట్ ను తనిఖీ చేసారు. ఆప్షన్ 3 క్రింద రిజిస్టర్ అయిన వారికీ వెంటనే బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆదేశించారు. పనులు పూర్తయిన మేరకు బిల్లులను జనరేట్ చేయాలనీ సూచించారు. ఎమేనిటీస్, ఇంజనీరింగ్ సహాయకులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని, పూర్తి చేసిన గృహాలను వెంటనే మాపింగ్ చేయాలన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేసించుకొని పని చేయాలన్నారు. అవసరమగు ట్రాన్స్ ఫార్మర్లకు అంచనాలను తయారు చేసి పంపాలని విద్యుత్ శాఖాధి కారులకు ఆదేశించారు. అనంతరం కొండకరకాం లే ఔట్ ను తనిఖీ చేసారు. 300 గృహాలకు గాను 96 మాత్రమే పనులు ప్రారంభం కావడం పట్ల ఇంజనీరింగ్ సహకుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆషాడ మాసం అంటున్నారు, శ్రావణం లో ప్రారంభిస్తారని వారు సమాధానం చెప్పగా శ్రావణం లో ప్రారంభించక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టడానికి ముందుకు రానివారి ఇళ్ళను ఆప్షన్ 3 క్రింద మార్పు చేయాలనీ అన్నారు. లే అవుట్ వద్ద వీధి లైట్లను ఏర్పాటు చేయాలని ఎం.పి.డి.ఓ సత్యనారాయణ కు సూచించారు. సారిక లే అవుట్ ను తనిఖీ చేసారు. 94 ఎకరాల్లో 4231 ప్లాట్లు వేయుటకు ల్యాండ్ లెవెలింగ్, రహదారులు, ప్లాట్ మార్కింగ్ తదితర పనులు జరుగుతున్నాయి . ఎక్కువ యంత్రాలను పెట్టి వేగంగా పనులు జరిగేలా చూడాలని సూచించారు.
కొండవెలగాడ వద్ద నున్న సోనియా నగర్ లో నున్న టిడ్కో గృహాలను పరిశీలించారు. మౌలిక వసతులను కల్పించి, లబ్ది దారులకు రుణాలను అందజేసే ఏర్పాట్లను చేయాలనీ టిడ్కో ప్రాజెక్ట్ అధికారి జ్యోతి కి సూచించారు. కోరుకొండ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసారు. పిల్లలతో మాట్లాడి, పాటలు పాడించారు. కేంద్రానికి వచ్చిన గర్భిణీలు, బాలింతలతో మాట్లాడారు. వారు అక్కడే భోజనం చేయడం పై సంతృప్తిని వ్యక్తం చేసారు. మెనూ చార్ట్ ప్రకారంగా భోజనం పెడుతున్నాదీ లేనిదీ అడిగారు. శ్యాం , మాం పిల్లలు ఈ కేంద్రం లో లేరని కార్యకర్త వివరించారు. కేంద్రానికి సరఫరా అయిన బియ్యం పోర్టిఫైడ్ బియ్యమా కాదా అని తనిఖీ చేసారు. రిజిస్టర్లను తనిఖీ చేసారు. అక్కడికి వచ్చిన్ సర్పంచ్ తో మాట్లాడి కేంద్రానికి కాంపౌండ్ వాల్ కట్టాలని, టాయిలెట్ లను మరమ్మత్తులు చ్పట్టాలని కోరారు. అదే విధంగా వేల్నేస్స్ సెంటర్ , ఆర్.బి.కే లను త్వరగా పూర్తి చేయాలనీ కోరారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసారు. గ్రామం లో విత్తనాల సమస్య ఉందా అని సర్పంచ్ ను అడిగారు. లేదని బదులిచ్చారు. వ్యవసాయ సహాయకులతో మాట్లాడి సి.హెచ్.సి లో ట్రాక్టర్ వినియోగ, డి.కృషి యాప్, పంటల మార్పిడి పై అవగాహన కల్పిస్తున్నారా తదితర అంశాల పై ఆరా తీసారు. ఈ పర్యటన లో గృహ నిర్మాణ శాఖ డి.ఈ రంగారావు, తహసిల్దార్, వ్యవసాయ, ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.