సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
Ens Balu
2
Kakinada
2022-07-13 10:57:37
ఏపిలో మూడు రోజుల నుండి మున్సిపల్ కార్మికసమస్యల పరిష్కారం కోరుతూచేపట్టిన సమ్మె పరిణామాలుప్రజారోగ్యా నికి విఘాతం కలిగించే తీవ్రతరం అవుతున్నందున ప్రభుత్వ చర్చలు సఫలీకృతం చేయించి విరమింపచేయాలని రాష్ట్ర గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కు పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు లేఖ వ్రాశారు. ఈమేరకు బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య బత్యంఆపాస్ సమస్యలు గ్రాట్యుటీ ఫెన్షన్ సమానపనికి సమానవేతనం మున్నగు అంశాలపైమూడేళ్లుగా మున్సిపల్ కార్మిక సంఘాలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పరిష్కరించే చొరవచూపలేదన్నారు. చెత్తలు పేరుకుపోవడం వలన ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందన్నారు. ముక్కు పిండి పలు పథకాల సొమ్ము నుండి సచివాలయం సిబ్బందితో చెత్త పన్నులు బలవంతంగా వసూలు చేయిస్తున్న ప్రభుత్వం మున్సిపల్ చెత్తలు తరలించే విషయంలో పరిష్కార చర్యలు లేకుండా కాలయాపన చేయడం మంచిదికాదన్నారు. సమ్మె పరిష్కారానికి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు.కాకినాడ నగరంలో మూడు రోజులుగా 780మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకు పోయి వుందన్నారు. వర్షాల కాలంలో చెత్తలనిక్షిప్తం ప్రజారోగ్యానికి మంచిపరిణామం కాదన్నారు.