గోపాలపురం బాధితులకు అండగా ఉంటాం
Ens Balu
7
Sankhavaram
2022-07-13 14:11:16
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని డిస్పోజబుల్ ప్లేట్లపై ముద్రించి అవమానించడమే కాకుండా, దానిపై ప్రశ్నించిన 18 మంది దళిత యువకులపై కేసులు పెట్టి జైలు పాలు చేయడం తగదని అంబేద్కర్ ఇండియన్ మిషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ గునపర్తి అపురూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా, శంఖవరం మండలంలో ఆయన బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనలో అత్యుత్సాహం చూపించి దారుణమైన సెక్షన్లతో దళిత యువకులపై కేసులు పెట్టి అరెస్టు చేసిన ఎస్‌ఐ, సిఐ, డిఎస్‌పిలను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టిన బాధితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలన్నారు. తప్పుడు కేసులను ఎత్తివేయాలని, ఘటనకు కారణమైన అన్నపూర్ణ రెస్టారెంట్ యజమానిని, ప్లేట్లను సరఫరా చేసిన వ్యక్తిని, దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే అంబేద్కర్ ఇండియన్ మిషన్ కాకినాడ జిల్లా కన్వీనర్ దిలీప్ కుమార్ రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో పర్యటించి అరెస్టైన బాధితుల కుటుంబాలను పరామర్శించారని తెలియజేశారు.