' మీకోసం' సేవలు అభినందనీయం
Ens Balu
5
Sarpavaram Junction
2022-07-14 05:53:41
అభాగ్యులకు, నిరుపేదలకు మేమున్నామంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ' మీకోసం' స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని ఆధ్యాత్మికవేత్త వీరభద్రరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోలని సర్పవరం జంక్షన్ మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరోపకారమే భగవంతునికి అత్యంత ఇష్టమైన కార్యమైనందున ప్రతి ఒక్కరు నిష్కామ భావంతో సేవలు చేయాలని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన యువకులు తమ సంపాదనలో కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం అభినందినీయమని వీరభద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగేశ్వరరావు రావు, సందీప్, మూర్తి, వెంకటరమణ, అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.