సీఎం పర్యటన విజయవంతం చేయాలి
Ens Balu
15
విశాఖపట్నం
2022-07-14 08:19:54
ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో రేపు జరగనున్న వాహన మిత్ర లబ్దిదారులకు 2వ విడత నగదు జమచేసే కార్యక్రమం ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, నెడ్ క్యాప్ చైర్మన్ కెకె.రాజు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి సంక్షేమం కొరకు అనేక రకాల సంక్షేమ ఫలాలను అందిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వి. ప్రసాద్, శశికళ మరియు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.