ఆడబిడ్డ భారమైతే శిశు కేంద్రానికివ్వాలి


Ens Balu
3
Sarpavaram Junction
2022-07-14 08:33:36

ఆడపిల్లలంటే భారం అనుకుని కొందరు పుట్టగానే వదిలేయడం, చెత్తకుప్పల్లో వేయడం చేస్తున్నారని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు.  గురువారం కాకినాడలోని శేషాద్రి నగర్ లో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందే పుట్టిన పసికందును చెత్తకుప్ప లేదా మురికి కాలువల్లో వేస్తున్నారని ఇది తగదని అన్నారు.  శిశువు జీవితాన్ని నాశనం చేసే హక్కు లేనందున ఆ శిశువును శిశు కేంద్రాలకు అప్పగించాలని సూచించారు. ఎక్కడైనా ఇటువంటి ఘటనలు ఎదురైతే శిశు కేంద్రాలకు సమాచారం అందించాలన్నారు. ఏ ఒక్క తల్లి పదిమాసాలు కడుపున మోసిన ఏ బిడ్డనైనా భారంగా అనుకోకూడదని అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా  ఉయ్యాలను ఏర్పాటు చేశారని పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.
సిఫార్సు