ఎగువ గోదవారిలో అత్యధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరదల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ , కటుకూరు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అటు వరదల్లో చిక్కుపోయిన వారికి ఆహారాన్ని అందించేందుకు డా.బి.ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. వాటి ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.