సీనియర్ సిటిజన్స్ కు రాయితీ ఇవ్వాలి


Ens Balu
8
Kakinada
2022-07-14 08:51:18

రైళ్లలో ప్రయాణించే 50ఏళ్లు పైబడిన మహిళలకు50% శాతం 60ఏళ్లు పైబడిన పురుషులకు 40% శాతం రాయితీని రైల్వే శాఖ యధావిధిగా కొనసాగించాలని కాకినాడ పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు ప్రభుత్వాన్ని కోరారు.  ఈ మేరకు భారతీయ రైల్వేకి రాసిన లేఖను మీడియాకి విడుదల చేశారు. రైల్వేశాఖ గతరెండేళ్లుగా కరోనా కారణంతో వృద్దులకు ఇచ్చే రాయితీలు నిలిపివేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని కొనసాగించకుండా రైల్వేప్రయి వేటీకరణ అజెండా అమలుకోసం అడ్డుకట్ట వేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైల్వేజనరల్ ప్రయాణా లు జనరల్ బోగీలు నిర్వహణ లేకుండా రిజర్వేషన్ కొనసాగిం చడం వలన రైలు ప్రయాణం ధర రెట్టింపు గా మారిపోయిందని, తద్వారా సీనియర్ సిటిజన్స్ కు భారంగా పరిణమించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియర్ సిటిజన్స్ కు రైల్వేలో ఇచ్చే ప్రయాణ రాయితీ విషయంలో ఒత్తిడి చేయాల్సిన బాధ్యత వుందన్నారు.  సీనియర్ సిటిజన్స్ పట్ల ఔదార్యం చూపాలని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ను లేఖలో కోరినట్టు మీడియా ద్వారా వివరించారు.

సిఫార్సు