ఎలాంటి వరద పరిస్థితులను ఎదుర్కొంటాం


Ens Balu
2
Narsapur
2022-07-14 10:02:28

పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లాలో ఎటువంటి వరద పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. గోదావరి ఉధృతి, అధిక వర్షాలవల్ల వరద తాకిడికిగురయ్యే నరసాపురం మండలంలోని పొన్నపల్లి, లాక్ డౌన్, కొత్త నవరసపురం, పాతనవరసపురం గ్రామాల్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు  జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాద్ రాజు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వరద పెరిగినా ముంపుకు గురవ్వకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, వరద పెరిగితే అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. పునరాస కేంద్రంలో మంచి భోజనం అందజేయడంతో పాటు, పరిశుభ్రంగా ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.   మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి షిఫ్ట్ ల వారీగా పనిచేసేలా విధులను కేటాయించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో విధులను కేటాయించిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.  నిత్యవసర వస్తువులతో పాటు అవసరమైన మందులను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పర్యటనలో భీమవరం ఆర్డీవో దాసిరాజు, నీటిపారుదల శాఖ డ్రైనేజీ ఈ ఈ పి.నాగార్జునరావు, తహసిల్దార్ ఫాజిల్, ఎంపీడీవో ఎన్ వి ఎస్ ప్రసాద్ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, పురపాలక సంఘ కమిషనర్ సి హెచ్ శ్రీనివాస్,  వివిధ శాఖలు అధికారులు, కౌన్సిలర్స్, సర్పంచులు, తదితరులు వున్నారు.
సిఫార్సు