కాకినాడ సర్పవరం జంక్షన్ లోని ఫ్రెండ్స్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో అవసరాల సుబ్బారావు -కమల దంపతుల సౌజన్యంతో దివ్యాంగునికి మూడు చక్రాల బండి పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు పివి రాజేశ్వరి మాట్లాడుతూ వైకల్యం అనేది శారీరకమైన, మానసికమైన, పరిసరాలు అవరోధాలు అనే బాహ్య కారణాల వలన వస్తుందన్నారు. కుమారపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి చంటి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోవడంతో దాతల సౌజన్యంతో మూడు చక్రాల బండిని అందజేశామన్నారు. మంచి మనసున్న దాతల ద్వారా ఎందరో నిరుపేదలకు, అభాగ్యులకు సేవలు అందతున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ తమవంతుగా సామాజిక సేవలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజా నీలిమ, లక్ష్మి, మహేష్, మల్లేష్, సునీల్, మానస, స్వర్ణలత, అడబాల రత్న ప్రసాద్ ,రవిశంకర్ పట్నాయక్, రాజా, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.