నైపుణ్యతను పెంపొందించుకోవాలి
Ens Balu
1
Kakinada
2022-07-15 09:32:05
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందున నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విశ్రాంతి ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి. పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా యువతలో నైపుణ్యాలను రూపొందించేందుకు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 15- 24 మధ్యస్థ వయస్సు కలిగిన వ్యక్తులను యువతగా పరిగణిస్తామన్నారు. యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రధానమంత్రి కౌశి ల్ కేంద్రం పేరుతో సాంకేతిక వృత్తిపరమైన శిక్షణను ఇస్తుందన్నారు. కొత్త నైపుణ్యాలను ప్రవేశపెట్టడం, వినూత్నమైన ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను ఈ శాఖ ప్రోత్సహిస్తున్నందున యువత సద్వినియోపరుచుకోవాలని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.