వరద బాధితులు నిత్యవసరాలు


Ens Balu
3
Achanta
2022-07-15 12:31:29

పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం, కందిపప్పు, పామ్ఆయిల్ పంపిణీకి  రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కె.జి వంట నూనె వరద ముంపు గ్రామాల ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. వరద సహాయక చర్యల్లో భాగంగా గోదావరి వరద తాకిడికి గురైన పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాలలో  ప్రభుత్వం ప్రకటించిన విధంగా సహాయం అందనున్నది. వరద తగ్గుముఖం పట్టేవరకు బాధిత కుటుంబాలు పునరావాస శిబిరాలలో ఉండాలని,  వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. వరద కారణంగా ఇళ్ళు  ముంపునకు గురయ్యే ప్రజలు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటె వెంటనే పునరావాస శిబిరాలకు చేరుకోవాలన్నారు.  పునరావాస శిబిరాల్లోకి రమ్మని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయనప్పటికి కొన్ని   కుటుంబాలవారు రావడంలేదన్నారు. అధికారుల సూచనల మేరకు అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరారు. పునరావాస శిబిరాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్నామని, తాగునీటి కి ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.  పునరావాస శిబిరాలలో అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
సిఫార్సు